తిరుపతి, డిసెంబర్ 3 : రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో నగరవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్లో 31 మందిపై కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం కలిగించిన మరో 25 మందిపై కూడా చర్యలు తీసుకున్నారు. 3వ అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సంధ్యారాణి విచారణ జరిపి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ప్రతి ఒక్కరికి ₹10,000 చొప్పున మొత్తం ₹3,10,000 జరిమానా విధించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించిన 25 మందికి ఒక్కొక్కరు ₹500 చొప్పున మొత్తం ₹12,500 జరిమానా విధించింది. మొత్తంగా ఒక్క రోజులోనే ₹3,22,500 జరిమానా వసూలు చేశారు.
#DrunkAndDrive #TirupatiTraffic #RoadSafety #DontDrinkAndDrive #TrafficPolice