- అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేస్తే కూల్చివేత..
- కఠిన హెచ్చరిక జారీ చేసిన తిరుపతి మున్సిపల్ కమిషనర్
తిరుపతి, డిసెంబర్ 3 : నగరపాలక సంస్థ అనుమతి లేకుండా భవన నిర్మాణాలు, అదనపు అంతస్థులు (Unauthorized Constructions) కట్టినచో కఠిన చర్యలు తప్పవని తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య (N. Mourya) హెచ్చరించారు. ఆగస్టు 31 తర్వాత జరిగిన అన్ని నిర్మాణాలపై శాటిలైట్ నిఘా (Satellite Surveillance) ఉందని, రూల్ ఉల్లంఘనలు గుర్తిస్తే వెంటనే కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
బుధవారం తిరుమల బైపాస్ రోడ్డు, ఎన్జీవో కాలనీలో అనధికారికంగా జరుగుతున్న అదనపు అంతస్థు నిర్మాణాలను గుర్తించిన అధికారులు కమిషనర్ ఆదేశాల మేరకు వాటిని తొలగించారు. డిసిపి ఖాన్, ఏసీపీలు మూర్తి, మధు, టిపిఓ వంశీ, టిపిబిఓలు శరన్ రాజ్, సంతోష్, హరీష్, ప్లానింగ్ సెక్రటరీలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.
కమిషనర్ మౌర్య మాట్లాడుతూ.. “అదనపు అంతస్థులు కావాలంటే నిబంధనల ప్రకారం టిడిఆర్ బాండ్లు (TDR Bonds) ఉపయోగించుకోవచ్చు. ఆగస్టు 31 లోపు జరిగిన నిబంధనా ఉల్లంఘనలైతే బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (BPS Scheme) ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత అనుమతి లేకుండా నిర్మాణం జరిగితే రాజీ లేదు, నేరుగా కూల్చివేత” అని హెచ్చరించారు. ప్రజలకు ఈ నిబంధనలపై మరింత అవగాహన కల్పించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
#TirupatiCorporation #UnauthorizedConstruction #TDRBonds #BPSScheme #NMourya #Demolition