మదనపల్లి, డిసెంబర్ 3 : మదనపల్లి ట్రెజరీ కార్యాలయం (Madanapalle Treasury) వద్ద బుధవారం పట్టపగలే లక్ష రూపాయల నగదు చోరీ (Cash Theft) జరిగింది. ట్రెజరీలో పని మీద వచ్చిన ఉద్యోగి శ్రీనివాసులు వద్ద చేతివాటం (Sleight of Hand) ప్రదర్శించిన ఓ దొంగ.. “ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రమ్మని, ఇక్కడే నగదు చూసుకుంటాను” అని నమ్మించి లక్ష రూపాయల నగదుతో కాల్కిప్పాడు. శ్రీనివాసులు జిరాక్స్ తీసుకొచ్చేసరికి దొంగ మాయమైపోయాడు. వెంటనే బాధితుడు మదనపల్లి 1-టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
#MadanapalleTheft #TreasuryRobbery #CashSnatch #SleightOfHand #AnnamayyaDistrict