తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న రేణిగుంట ముంపు ప్రాంతాల్లో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టిటిడి ఎక్స్ అఫీషియో సభ్యులు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పర్యటించారు. బుధవారం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ, పాంచాలి నగర్, మండలంలోని లోతట్టు ముంపు ప్రాంతాలలో డాలర్స్ దివాకర్ రెడ్డి పర్యటించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమైన ప్రాంతాలను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. తుడా నుంచి అవసరమైన సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.