నగరి, డిసెంబర్ 3 : విజయపురం మండలం పన్నూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్లో సోమవారం రాత్రి బ్యాంకు చోరీకి (Bank Theft Attempt) దొంగలు ప్రయత్నించారు. సీసీ కెమెరాల వైర్లు తొలగించి, బ్యాంకుకు ఉన్న గ్రిల్ తాళాలను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు.
గ్రిల్ బద్దలు కొట్టే శబ్దం విన్న స్థానికులు గమనించి అరుస్తూ వచ్చేసరికి దొంగలు పరారయ్యారు. మంగళవారం ఉదయం బ్యాంకు మేనేజర్ ఆర్కే విశ్వనాథ్ విజయపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న నగరి డీఎస్పీ సయ్యద్ అబ్దుల్ అజీజ్, రూరల్ సీఐ భాస్కర్ స్థలానికి చేరుకుని పరిశీలించారు. విజయపురం ఎస్ఐ మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
#BankTheftAttempt #SBIPannuru #Chittoor #Vijayapuram #CCTVCut