తిరుమల: పవిత్ర క్షేత్రం తిరుమలలో అన్యమత చిహ్నం స్టిక్కర్ అతికించిన వాహనం పట్టుబడటంతో తీవ్ర కలకలం రేపింది. గత మంగళవారం ఉదయం 10.40 గంటల సమయంలో అలిపిరి చెక్‌పోస్ట్‌లోని 9వ లేన్ గుండా వచ్చిన ఈ వాహనాన్ని చెక్ చేస్తున్న సమయంలో విధుల్లో ఉన్న CT-5949 వి. వాసు బాబు ఆ స్టిక్కర్‌ను గుర్తించకుండా వదిలేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే విజిలెన్స్ సిబ్బంది చురుగ్గా వ్యవహరించారు. తిరుమలలోని ఫైర్ ఆఫీస్ సమీప పార్కింగ్‌లో వాహనాన్ని గుర్తించి, అన్యమత చిహ్నం స్టిక్కర్‌ను తొలగించారు. అనంతరం ఇది పవిత్రక్షేత్ర నియమావళికి విరుద్ధమని గుర్తించిన అధికారులు, తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో వాహన డ్రైవర్ గోబి (కరూర్ జిల్లా, తమిళనాడు) మరియు వాహన యజమానిపై AP CHRIE Act – 1987 పరిధిలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చెక్‌పోస్ట్ వద్ద కీలక బాధ్యతలు ఉన్నప్పటికీ పలుమార్లు ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు CT-5949 వి. వాసు బాబును వెంటనే అలిపిరి విధుల్లోనుంచి తప్పించి, అతని పై శాఖాపరంగా చర్యలు ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు.
#Tirumala #TTD #NonHinduSticker #TirumalaNews #VehicleCase #APNews #HinduReligiousAct #VigilanceAction