*నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య.
22అక్టోబర్ 25: తిరుపతి.
వర్షాల వలన నగరంలోని అండర్ బ్రిడ్జిల్లో వర్షపు నీరు నిలవకుండా తగుచర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు. వర్షాలతో నగరంలోని డి.ఆర్. మహల్, ఆర్.సి.రోడ్డు, బాలాజీ కాలనీ అండర్ బ్రిడ్జిల ను బుధవారం ఉదయం పరిశీలించి
అండర్ బ్రిడ్జిల కింద వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో పంపింగ్ చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ ఎస్.కె.బాబు, డి.ఈ. మహేష్, ఇంజినీరింగ్, పారిశుధ్య సిబ్బంది ఉన్నారు.