- లక్ష్యాలు తప్పనిసరిగా సాధించాలి
- ఇంచార్జి జాయింట్ కలెక్టర్ ఎన్.మౌర్య
తిరుపతి, డిసెంబర్ 3 : ప్రధానమంత్రి స్వనిధి పథకం (PM SVANidhi) కింద వీధి వ్యాపారులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని, బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని ఇంచార్జి జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య (N Mourya) బ్యాంకర్లను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన డీసీసీ/డీఎల్ఆర్సీ రెండో త్రైమాసిక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎస్‌హెచ్‌జీలు, వ్యవసాయం, పాడి రైతులకు నిర్దేశిత లక్ష్యాల మేరకు రుణాలు విరివిగా మంజూరు చేయాలని సూచించారు. ప్రైవేట్ బ్యాంకులు విద్యా రుణాలు (Education Loans) మంజూరు చేసి పురోగతి సాధించాలని, క్రాప్ ఇన్సూరెన్స్‌పై రైతులకు వ్యవసాయ అధికారుల ద్వారా అవగాహన కల్పించి, అర్హులందరికీ కవరేజీ అందేలా చూడాలని ఆదేశించారు.
బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ రుణాలు, పీఎంఈజీపీ, ముద్రా, స్టాండప్ ఇండియా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగ రుణాలు బ్రాంచి వారీగా కేటాయించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని హెచ్చరించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకు లింకేజీ కల్పించాలని, నిర్దేశిత గడువులోపు లక్ష్యాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు.
సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ రాజేష్ కుమార్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ ఆర్ఎం పరమేశ్వర్ నాయక్, నాబార్డ్ డీడీఎం సునీల్, ఎల్డీఎం రవికుమార్, డీఆర్డీఏ పీడీ శోభన్ బాబు, వ్యవసాయ, హార్టికల్చర్, పశు సంవర్ధక శాఖ అధికారులు, మెప్మా పీడీ ఇఫ్రైన్ తదితరులు పాల్గొన్నారు.
English Hashtags
#PMSVANidhi #NMourya #BankLoanTargets #Tirupati #EducationLoans #CropInsurance