తిరుపతి : ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఐఏఎస్ వి.ప్రసన్న వెంకటేష్ ఆదివారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పేర్కొంటూ.. రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇస్తామన్నారు. 4 నెలల శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ నెల 13 నుంచి 26 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. దరఖాస్తుకు మరో మూడు రోజులలే మిగిలి ఉన్నందున అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 30.11.2025 న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు https://apstudycircle.apcfss.in వెబ్ సైట్ ని సంప్రదించాలని అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
#UPSC
#UPSC2026
#FreeCoaching
#SCSTYouth
#AmbedkarStudyCircle
#APGovtSchemes
#UPSCTraining
#PrelimsCoaching
#AndhraPradesh
#EducationNews