కర్నూలు: ఆన్లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon)పై కర్నూలు జిల్లా కన్జ్యూమర్ ఫోరం నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-bailable Warrant) జారీ చేసింది. రూ.80 వేల రూపాయలు చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus) ఆర్డర్ చేసిన వినియోగదారుడికి దాని బదులు ఐక్యూ ఫోన్ (iQOO Phone) పంపినందుకు ఫోరం ఈ ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి— కర్నూలుకు చెందిన ఒక వ్యక్తి అమెజాన్ ద్వారా రూ.80 వేల విలువైన ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేశారు. అయితే డెలివరీ సమయంలో ఆయనకు తక్కువ ధర కలిగిన ఐక్యూ ఫోన్ రావడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే కస్టమర్ కేర్ (Customer Care) ద్వారా ఫిర్యాదు చేసినా, సంస్థ స్పందించకపోవడంతో బాధితుడు కంజ్యూమర్ ఫోరం (Consumer Forum) ని ఆశ్రయించారు.
విచారణ అనంతరం ఫోరం తన తీర్పులో అమెజాన్ సంస్థ బాధితుడికి ఐఫోన్ 15 ప్లస్ డెలివరీ (iPhone 15 Plus Delivery) చేయాలని లేదా రూ.80 వేలు రిఫండ్ (Refund) చేయాలని, అదనంగా రూ.25 వేల రూపాయలు నష్టపరిహారం (Compensation)గా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఫోరం సంస్థపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 21 (November 21)కి వాయిదా వేసినట్టు ఫోరం వెల్లడించింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా ఆన్లైన్ కొనుగోలుదారుల్లో చర్చనీయాంశంగా మారింది.