అమరావతి, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు భలే శుభవార్త! కూటమి ప్రభుత్వం ఏ క్షణమైనా లక్షకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలతో భారీ జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి HRMS పోర్టల్‌లో ఈ వివరాలు ఆన్లైన్లో నమోదవుతున్నాయి.
అందిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 30 శాతం ఖాళీలు ఉన్నట్లు అంచనా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ (DR) ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీలు సుమారు 99 వేల వరకు ఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
శాఖల వారీగా ఖాళీల వివరాలు:
రెవెన్యూ శాఖ – 13,000 ఖాళీలు (2,552 డైరెక్ట్ రిక్రూట్మెంట్)
ఉన్నత విద్యా శాఖ – 7,000 పోస్టులు (విశ్వవిద్యాలయాల్లో 3,000+)
పురపాలక & పట్టణాభివృద్ధి – 27,000 ఖాళీలు (23,000 భర్తీ అవకాశం)
నైపుణ్యాభివృద్ధి & శిక్షణ – 4,000+ (2,600 డైరెక్ట్)
వ్యవసాయ శాఖ – 3,000+ (2,400 DR)
పంచాయతీరాజ్ – 26,000 వరకు భర్తీ అవకాశం + 3,000 పదోన్నతులు
మహిళా-శిశు సంక్షేమ – 2,400 (1,820 భర్తీకి సిద్ధం)
పాఠశాల విద్య (బోధన + బోధనేతర) – సుమారు 30,000
ప్రజారోగ్య & కుటుంబ సంక్షేమ – 10,000 వరకు
ఇక పాఠశాల విద్యతో సహా మరో 24 శాఖలు ఖాళీల వివరాలను ఇంకా ఖరారు చేయలేదు. 21 శాఖల్లో డేటా ఎంట్రీ ప్రాసెస్‌లో ఉంది. అన్ని శాఖల లెక్కలు పూర్తయిన వెంటనే మెగా జాబ్ క్యాలెండర్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతతో ఆసలు మళ్లీ చిగురించనున్నాయి.
Hashtags:
#APJobCalendar #MegaDSC #APGovtJobs #1LakhJobs #Unemployment #AndhraPradesh #JobNotification #NirudyogaYouth #JaiTDPJSPBJP