- 15 బహుళజాతి కంపెనీల్లో 700కిపైగా ఉద్యోగాలు
గూడూరు (తిరుపతి జిల్లా), డిసెంబర్ 3 : గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ (Dr. Pasam Sunil Kumar) చేతుల మీదుగా మంగళవారం మెగా జాబ్ మేళా (Job Mela) పోస్టర్ను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 6 (శనివారం) ఉదయం 8 గంటల నుంచి గూడూరులోని డీఆర్డబ్ల్యు డిగ్రీ కళాశాల (DRW Degree College)లో ఈ జాబ్ మేళా జరగనుంది.
శ్రీసిటీ, మేనకూరు సెజ్, ఈఎంసీ క్లస్టర్, తిరుపతి, చెన్నైలోని 15 బహుళజాతి కంపెనీలు (Multinational Companies) పాల్గొని 700కిపైగా ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. 5వ తరగతి నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్న నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కోరారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి రిజిస్ట్రేషన్ లింక్: https://naipunyam.ap.gov.in/user-registration ఆధార్ OTPతో ట్రైనీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. చివరి తేదీ: డిసెంబర్ 5, 2025 స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. వివరాలకు: 9700561225, 8639835953, 9988853335 (కాల్ సెంటర్) సంప్రదించవచ్చు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో స్కిల్ హబ్ కోఆర్డినేటర్ చెన్నయ్య, ఈఎస్సీ కోఆర్డినేటర్ చెంచయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
#GudurJobMela #APSSDC #JobFair #PasamSunilKumar #TirupatiJobs #Employment