- కూటమి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం
- ₹37.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి, డిసెంబర్ 3 : “రాష్ట్రం ఎంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటకు కూటమి ప్రభుత్వం (Alliance Government) కట్టుబడి ఉంది. ఇది మనందరి ప్రభుత్వం” అని చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని (Pulivarathi Nani) గారు పేర్కొన్నారు.
బుధవారం తిరుపతి రూరల్ మండలం తనపల్లిలోని రఘునాథ్ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రగిరి, తిరుపతి, పాకాల, రామచంద్రాపురం, యర్రవారిపాలెం, చిన్నగొట్టిగళ్ళు మండలాలకు చెందిన అనారోగ్యులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా రూ.37,40,528 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా అందజేశారు.
ఈ మేరకు లబ్ధిదారుల సమస్యలను ఎమ్మెల్యే నాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) దృష్టికి తీసుకెళ్లగానే సీఎంగారు తక్షణమే స్పందించి చెక్కులు మంజూరు చేయించారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కష్టకాలంలో తమ కుటుంబాలను ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబా� INు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు.
#PulivarathiNani #CMRF #AllianceGovt #Chandragiri #Chandrababu #PawanKalyan #NaraLokesh