- గంజాయి, గ్యాంబ్లింగ్, ఓపెన్ డ్రింకింగ్పై ఎస్పీ అజిత వేజెండ్ల కఠిన నిఘా!
నెల్లూరు, డిసెంబర్ 3 : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘా (Drone Surveillance) విస్తృతంగా కొనసాగుతోంది. ఉదయం 9–11, సాయంత్రం 4–6, రాత్రి 7–9 గంటల సమయంలో పట్టణం, శివారు, నిర్మానుష్య ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ జరుగుతోంది.
గంజాయి సేవించడం, అమ్మకం, రవాణా, బహిరంగంగా మద్యం సేవించడం (Open Drinking), గ్యాంబ్లింగ్, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, ఓవర్ స్పీడ్, సెల్ఫోన్ డ్రైవింగ్, త్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్లను డ్రోన్ కెమెరాలు గుర్తిస్తున్నాయి. నేరాలు జరిగే అవకాశం ఉన్న పాడుబడిన భవనాలు, తోటలు, పార్కులు, నదీ తీరాలు, రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
“చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా డ్రోన్ కన్ను ఉంది. గంజాయి, మద్యం, జూదం వంటి అసాంఘిక చర్యలపై కఠిన చర్యలు తప్పవు” అని ఎస్పీ అజిత వేజెండ్ల హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.