- వరద ఉధృతికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదేశాలు
పిచ్చాటూరు, డిసెంబర్ 3 : అరుణా నదిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండడంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (MLA Koneti Adimulam ) ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం మధ్యాహ్నం ప్రాజెక్టు సందర్శించిన ఎమ్మెల్యే నీటి మట్టం, ఇన్‌ఫ్లో-అవుట్‌ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో వరద ఉధృతిని గమనించిన ఆయన ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి “వెంటనే నాలుగు గేట్లను పూర్తిగా ఎత్తి అధిక వరద నీటిని బయటకు పంపాలి” అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
గేట్లు ఎత్తే ముందు పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని అరుణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, నిబంధనల ప్రకారం సైరన్ మోగించి తమిళనాడు అధికారులకు సమాచారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
#Araniyar #FloodAlert #KonetiAdimulam #OpenGates #Pichatur #HeavyInflow