తిరుపతి : తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానశ్రయం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్ లాల్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఐజీ రాజకుమారి, ఎస్పీ సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
రాష్ట్రపతి శుక్రవారం (నవంబర్ 21) తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
హ్యాష్‌ట్యాగ్స్: #PresidentDroupadiMurmu #DraupadiMurmu #Tirupati #Tirumala #ReniguntaAirport #AndhraPradesh #APNews #PresidentVisitAP