హైదరాబాద్, డిసెంబర్ 3 : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma)ను హైదరాబాద్లోని రాజ్భవన్లో బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీవారి శాలువా, తీర్థప్రసాదాలను (Prasadam) టీటీడీ చైర్మన్ గవర్నర్కు అందజేసి సత్కరించారు. టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు అత్యంత రుచికరంగా, నాణ్యతతో కూడినవిగా ఉన్నాయని, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని గవర్నర్ ప్రశంసించారు. అనంతరం గవర్నర్ తమ స్వరాష్ట్రమైన త్రిపుర (Tripura)లో శ్రీవారి ఆలయం నిర్మించాలని బీఆర్ నాయుడును కోరారు. ఈ మేరకు త్రిపుర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఆలయ నిర్మాణాన్ని టీటీడీ చేపడుతుందని హామీ ఇచ్చారు.
#TTD #TelanganaGovernor #JishnuDevVarma #BRNaidu #TirumalaTemple #Tripura