తిరుమల: టీటీడీ జీడిపప్పు కొనుగోలు టెండర్లో అక్రమాలు జరిగాయంటూ ఓ దినపత్రిక ప్రచురించిన వార్త పూర్తిగా తప్పుడు కథనమని టీటీడీ ఖండించింది, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాసినదని టీటీడీ ధ్వజమెత్తింది. ఆ వార్తలో ఒక్క అంశం కూడా నిజం లేదని టీటీడీ స్పష్టం చేసింది. 1.20 లక్షల కిలోల జీడిపప్పు కొనుగోలుకు పిలిచిన ఈ-టెండర్లో ఆరుగురు సరఫరాదారులు పాల్గొనగా.. చెన్నైకి చెందిన క్రిష్టీ క్వాలిటీ ఇండియా, ఫంక్షనల్ అండ్ ఇన్నోవేటివ్ ఫుడ్స్ అనే రెండు కంపెనీలు నకిలీ పత్రాలు సమర్పించినట్టు టెక్నికల్ మూల్యాంకనంలోనే గుర్తించామని టీటీడీ తెలిపింది. ప్రారంభ దశలోనే ఈ రెండు కంపెనీలను అనర్హులుగా ప్రకటించి.. వాటి నుంచి ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. నకిలీ ఈ-వే బిల్లులు సమర్పించినందుకు CGST చట్టం కింద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని.. అలాగే CVC మార్గదర్శకాల ప్రకారం ఈ రెండు కంపెనీలను రెండేళ్ల పాటు బ్లాక్లిస్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని టీటీడీ వెల్లడించింది. అసలు నిజాలను కనీసం పరిశీలించకుండా.. భక్తులను తప్పుదారి పట్టించేలా అర్ధసత్యాలతో వార్త రాయడం దురుద్దేశపూరితమని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
#TTDRefutes #AndhraJyothiFakeNews #CashewTenderTruth #Tirumala #TTDClarification #FakeDocuments #TTDTransparency #TirupatiNews #APNews