నరసాపురం (పశ్చిమగోదావరి), డిసెంబర్ 3 : నరసాపురం జేసీకేలే కాన్వెంట్ స్కూల్ యాజమాన్యం హిందూ మత ఆచారాలపై వివక్ష చూపుతోందంటూ విశ్వహిందూ పరిషత్ (VHP), భవానీ-అయ్యప్ప మాలధారులు బుధవారం స్కూలు ముందు భారీ ఆందోళన నిర్వహించారు. తణుకుల ఆశ్రిత ప్రాంతానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని భవానీ మాల వేసుకున్నారనే కారణంతో స్కూలు గేటు దగ్గరే అడ్డుకున్నారు. గతంలోనూ అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని ఇదే యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. “స్కూలు ఆవరణలో క్రిస్మస్ ట్రీ, స్టార్లు అలంకరిస్తే సమస్య లేదు.. కానీ హిందూ మాలలు మాత్రమే సమస్యనా?” అని మాలధారులు, విహెచ్పీ నాయకులు మండిపడ్డారు. స్కూలు గేటు ముందు నిరసనకారులు ధర్నాకు దిగి నినాదాలు చేశారు. హిందూ విద్యార్థులపై మత వివక్ష ఆపాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
#BhavaniMala #VHPProtest #NarsapuramConvent #ReligiousDiscrimination #HinduStudent #AyyappaMala